10వ తరగతి, ITI అర్హతతో టెక్నీషియన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | CSIR-NPL Technician Recruitment 2026
సెంట్రల్ గవర్నమెంట్ కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! దేశంలోని ప్రముఖ శాస్త్రీయ పరిశోధనా సంస్థలలో ఒకటైన CSIR-National Physical Laboratory (CSIR-NPL), టెక్నీషియన్ (Technician-1) పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పూర్తి చేసి, సంబంధిత ట్రేడ్‌లో ITI అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
CSIR-NPL గురించి
CSIR- National Physical Laboratory (NPL) అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక ప్రముఖ జాతీయ పరిశోధనా సంస్థ. దేశంలో కొలమాన ప్రమాణాలను నిర్వహించడం, శాస్త్రీయ పరిశోధనను అభివృద్ధి చేయడం మరియు ఆధునిక సాంకేతికతలో నూతన ఆవిష్కరణలకు దోహదపడటం ఈ సంస్థ యొక్క ప్రాథమిక లక్ష్యాలు.
CSIR-NPL Technician Recruitment 2026 ముఖ్యాంశాలు
CSIR-NPL జారీ చేసిన ప్రకటన సంఖ్య Rect./02/2026 ప్రకారం, టెక్నీషియన్ (1) పోస్టుల కోసం సెలక్షన్ ప్రస్తుతం కొనసాగుతోంది. వివిధ టెక్నాకల్ డిపార్ట్మెంట్ లో మొత్తం 20 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
| అంశం | వివరణ |
| పేరు | CSIR – నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (CSIR-NPL) |
| పోస్టు పేరు | టెక్నీషియన్ |
| మొత్తం ఖాళీలు | 20 Posts |
| ఉద్యోగ ప్రదేశం | న్యూఢిల్లీ |
| దరఖాస్తు విధానం | ఆఫ్‌లైన్ |
| జీతం | ₹19,900 – ₹63,200 |
| చివరి తేదీ | జూన్ 30, 2026 |
ఈ పోస్టులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి కాబట్టి, భవిష్యత్తులో పదోన్నతులు మరియు ఇతర సేవా ప్రయోజనాలకు అవకాశం ఉంది.
CSIR-NPL Technician Recruitment 2026 ఉద్యోగ వివరాలు
ప్రధానంగా, ఈ క్రింది ట్రేడ్లలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు:
- ఎలక్ట్రానిక్స్
- ఎలక్ట్రికల్
- కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)
- మల్టీమీడియా మరియు యానిమేషన్
- డిజిటల్ ఫోటోగ్రఫీ
- మెకానిక్ మోటార్ వెహికల్ (MMV)
ఈ ట్రేడ్లలో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందే మంచి అవకాశం ఉంది.
Also Read More : Amazon Jobs : ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు అమెజాన్‌లో భారీ ఉద్యోగ అవకాశాలు – ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్..!
CSIR-NPL Technician Recruitment 2026 విద్యా అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి: 10వ తరగతి లేదా దానికి సమానమైన విద్య.
- గుర్తింపు పొందిన కళాశాల నుండి సంబంధిత ట్రేడ్‌లో ITI certificate,
- నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ తప్పనిసరి.
వయోపరిమితి ( Age Limit )
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
ప్రభుత్వరూల్స్ ప్రకారం SC, ST, OBC, PwBD, and Ex-Servicemen మరియు మాజీ సైనికుల వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది.

జీతం మరియు అలవెన్సులు
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను 7వ పే కమిషన్ ప్రకారం లెవెల్-2 పే స్కేల్లో నియమిస్తారు.
జీతం ( Pay Scale )
₹19,900 నుండి ₹63,200 వరకు ప్రాథమిక జీతం చెల్లించబడుతుంది. దీనికి అదనంగా, ఈ క్రింది allowances కూడా వర్తిస్తాయి:
- కరువు భత్యం (DA)
ఇంటి అద్దె భత్యం (HRA) - రవాణా భత్యం
వైద్య సౌకర్యాలు
జాతీయ పింఛను వ్యవస్థ (NPS )
ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు
అన్ని Allowences లతో కలిపి, ఉద్యోగులకు నెలకు ₹44,000 లేదా అంతకంటే ఎక్కువ జీతాన్ని పొందవచ్చును
ఎంపిక ప్రక్రియ
- Trade Test or Skill Test
- Written Examination
- Document Verification
- Medical Examination
ఈ దశలన్నింటినీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే చివరి లో ఎంపిక చేయబడతారు.
ముఖ్యమైన లింక్‌లు
- Full Notification Pdf Click Here
- Application Pdf Click Here
- Official Website Click Here

M. T. Bheemesh తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 5 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, జాతీయ వార్తలు రోజు అప్డేట్ గురించి రాస్తుంటారు