భారతీయ రైల్వేలో 11,127 పోస్టుల కోసం దరఖాస్తులు నేటి నుండి ప్రారంభం | RRB ALP Railway Recruitment 2026
RRB ALP Railway Recruitment 2026 భారతీయ రైల్వేలో తమ కెరీర్‌ను ప్రారంభించాలనుకునే ఆసక్తిగల అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. దేశవ్యాప్తంగా మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ఒక నోటిఫికేషన్ (CEN 01/2026)ను విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తుల సమర్పణ ప్రారంభం: మే 15, 2026
- దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూన్ 14, 2026 (రాత్రి 11:59 గంటలు)
RRB ALP Railway Recruitment 2026 ఉద్యోగ వివరాలు:
- ఉద్యోగ శీర్షిక: అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)
- మొత్తం పోస్టులు: 11,127
- పే స్కేల్: ప్రారంభ జీతం ₹19,900/- ( 7th Pay Commission స్కేల్-2 ప్రకారం)
- వయస్సు: 01.01.2026 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య.
అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు:
ఆధార్ కార్డు తప్పనిసరి: నియామక ప్రక్రియలో పారదర్శకతను పాటించేందుకు, Aadhaar-based verification నిర్వహించబడుతుంది. అందువల్ల, అభ్యర్థులు తమ ఆధార్ వివరాలను సరిగ్గా అందించాలని సూచించడమైనది.
Document Verification : అభ్యర్థి పేరు మరియు Date of birth, వారి 10వ తరగతి marksheet and Aadhaar card లో పేర్కొన్న వాటితో సరిపోలాలి. ఏదైనా వ్యత్యాసం ఉంటే, వెంటనే మీ ఆధార్‌ను అప్డేట్ చేసుకోవాలని సిఫార్సు చేయబడింది.
దరఖాస్తు చేసే విధానం: ఆసక్తి గల అభ్యర్థులు official Railway website www.rrbapply.gov.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో Apply చేసుకోవాలి.
ప్రాంతీయ రైల్వే బోర్డులు:
హెచ్చరిక: రైల్వేలో నియామకాలు కేవలం Merit ఆధారంగా మాత్రమే జరుగుతాయి. ఉద్యోగం ఇప్పిస్తామని వాగ్దానం చేసే మధ్యవర్తులు లేదా బ్రోకర్ల పట్ల అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి.

M. T. Bheemesh తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 5 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, జాతీయ వార్తలు రోజు అప్డేట్ గురించి రాస్తుంటారు
